నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు
close

తాజా వార్తలు

Published : 26/04/2021 14:24 IST

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు

అమరావతి: కొవిడ్‌ చికిత్స పూర్తయినా రోగులను డిశ్చార్జ్‌ చేయని కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు జారీ చేసింది. చికిత్స పూర్తి చేసుకున్నప్పటికీ 10-14 రోజుల పాటు రోగులను ఉంచేసి ఆరోగ్యశ్రీ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. రోగి కోలుకున్నప్పటికీ డిశ్చార్జ్‌ చేయకుండా ఉంచేయటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఈ నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి రోజువారీ ట్రీట్ మెంట్ విధానంలో ఆస్పత్రులకు చెల్లింపులు జరపాల్సిందిగా టెక్నికల్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ .. కొన్ని ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కోలుకున్న రోగులను తక్షణమే డిశ్చార్జ్‌ చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని