వివేకా హత్యకేసుపై సీబీఐకి లేఖ
close

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:55 IST

వివేకా హత్యకేసుపై సీబీఐకి లేఖ


అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆసక్తికర విషయాలను బయటపెడుతూ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ సంచలనం రేపుతోంది.

 ‘‘2019 మార్చి 15న పులివెందులలోని ఆయన స్వగృహంలో వివేకానందరెడ్డి మరణించారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో జారి పడిపోయారని ఆరోజు మధ్యాహ్నం వరకు మీడియాలో ప్రసారం చేశారు. వివేకా హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత హత్య అని  తేలింది. ఆసుపత్రికి చేరే వరకు మృతదేహం వారి బంధువుల అధీనంలోనే ఉంది. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే వరకు ఘటనా స్థలిని ఎంపీ అవినాష్‌రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారు. ఆసమయంలో మీడియా, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదు. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎం సింగ్‌ నేతృత్వంలోని బృందం వైఎస్‌ వివేకా కేసు దర్యాప్తు చేస్తోంది. రెండు సార్లు ఫోన్‌లో ఆయన్ను సంప్రదించా. ఎన్‌ఎం సింగ్‌ సానుకూలంగా స్పందించినా ఇప్పటి వరకు కేసు వివరాలు తీసుకోలేదు. హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న తాను ఈ కేసు దర్యాప్తునకు సహకరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా ఏ అధికారీ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీబీఐ దర్యాప్తు చేపట్టి  ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదు. వివేకా హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని, ఈ కారణంగానే నన్ను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారు’’ అని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని