Sangam Dairy: తనిఖీలకు ఏసీబీ యత్నం
close

తాజా వార్తలు

Published : 06/05/2021 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sangam Dairy: తనిఖీలకు ఏసీబీ యత్నం

గుంటూరు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో తనిఖీల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. డెయిరీలోని కంప్యూటర్లు, సర్వర్లను తనిఖీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు యత్నించారు. అయితే తనిఖీలు చేసేందుకు ఏసీబీ బయట వ్యక్తులను తీసుకొచ్చిందని యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెటింగ్‌ డేటా ఉండే సర్వర్లను బయట వ్యక్తులతో తనిఖీ చేయించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. తనిఖీలకు కోర్టు అనుమతులు ఉన్నాయని ఏసీబీ అధికారులు యాజమాన్యానికి వివరించారు. బయటి వ్యక్తులతో తనిఖీ చేయిస్తే డేటా చోరీ జరగవచ్చన్న అనుమానాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు, సంగం డెయిరీ ప్రతినిధులకు మధ్య చర్చ జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని