కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో మరో కొత్త సమస్య! 

తాజా వార్తలు

Published : 06/07/2021 01:04 IST

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో మరో కొత్త సమస్య! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో క్రమంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతూ, యాక్టివ్‌ కేసుల సంఖ్య దిగి వస్తోంది. కొవిడ్‌ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. చికిత్సలో స్టెరాయిడ్లు వాడకం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇతర సమస్యలు ఉన్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. కోలుకున్న వారిలో కొంతమంది మధుమేహం బారిన కూడా పడ్డారు. ఇప్పుడు ఈ బాధలకు తోడు మరొకటి అదనంగా వచ్చి చేరింది. కొత్తగా ఎవాస్య్కులర్‌ నెక్రోసిస్‌(ఏవీఎన్‌) లేదా ఆస్టియో నెక్రోసిస్‌ అనే సమస్యను గుర్తించారు. దీనినే బోన్‌డెత్‌ అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డవారి ఎముకల్లోకి రక్తం సరఫరా తగ్గిపోయి, అది కరగడం ప్రారంభమవుతుంది.

ముంబయిలో ముగ్గురికి చికిత్స!

ఈ సమస్యతో బాధపడుతున్న ముగ్గురు బాధితులకు ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స అందించారు.  ‘‘ఈ సమస్యతో బాధపడేవారి ఫీమర్‌(తొడ ఎముక)లో నొప్పి కనిపించింది.  కొవిడ్‌ రోగులకు అధికంగా స్టెరాయిడ్లను ఇవ్వడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోంది. వెంటనే వైద్యులు రోగాన్ని పసిగట్టి చికిత్స అందించడం ప్రారంభించారు ’’ అని హిందుజా ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌ రోగుల్లో తలెత్తుతున్న ఈ వ్యాధికి సంబంధించి గత శనివారం ప్రసిద్ధ మెడికల్‌ జర్నల్‌ ‘బీజేఎం కేస్‌ స్టడీస్‌’లో డాక్టర్‌ అగర్వాల్‌ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని