close

తాజా వార్తలు

Published : 08/04/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఆగని ఉద్ధృతి: 1,26,789 కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాలు ఇంతకు ముందెన్నడూ లేని తీవ్రతను కళ్లకుగడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,37,781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,26,789 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. మరోవైపు, క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 9,10,319 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 6.59 శాతానికి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* తెలంగాణలో 2వేలు దాటిన కరోనా కేసులు

2.కరోనా వనరులుగా మద్యం దుకాణాలు

మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా మార్గదర్శకాల అమలుపై హైకోర్టుకు డీజీపీ నివేదిక సమర్పించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మనిషిని దేవుడితో పోల్చడమా?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారే అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం  ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గతంలో శ్రీవారి పింక్‌ డైమండ్‌ పోయిందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదు. మనిషిని దేవుడితో పోల్చడం సరికాదు. ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేశారు’’ అని చంద్రబాబు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెదేపా వర్గీయుల కారు ధ్వంసం

ఏపీలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కోనపల్లెలో తెదేపా వర్గీయుల కారును దుండగులు ధ్వంసం చేశారు. ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఉన్న కారు అద్దాలను పగులగొట్టారు. పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా వర్గీయులు డిమాండ్‌ చేస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

5. లంకెబిందెల్లో 5 కిలోల బంగారం 

జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు  అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు లంకెబిందెలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

6. సీఎంలతో మోదీ భేటీకి దీదీ దూరం..!

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీలో కొవిడ్‌ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ సంబంధిత అంశాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. భారత ప్రయాణికులకు న్యూజిలాండ్‌ ‘నో ఎంట్రీ’ 

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు (ఆ దేశ పౌరులతో సహా) తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అల్లు అర్జున్‌ తగ్గేదే లే - చిరంజీవి

‘పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తగ్గేదే లే!’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. గురువారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ తెలుపుతూ చిరు ఓ ట్వీట్‌ చేశారు. బుధవారం విడుదలైన ‘పుష్ప’ టీజర్‌ని తాను చూశానని చిరు తెలిపారు. టీజర్‌ ఊరమాస్‌ లెవల్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం బన్నీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భలే గిరాకీ ..వేతనాలు భారీ!

బ్యాంకింగ్, రియల్‌ ఎస్టేట్, సప్లై చైన్, వైద్య రంగం..ఇలా ఎన్నో రంగాల్లో ఉపయోగిస్తున్న సాంకేతికత- బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ. దశాబ్ద కాలంగా ఇది వేగంగా  అభివృద్ధి చెందుతూవస్తోంది. యు.ఎస్‌. స్కిల్‌ ఇండెక్స్‌లో ఇది అత్యంత త్వరితంగా ఎదుగుతున్న నైపుణ్యం. ఈ టెక్నాలజీని రోజువారీ ప్రక్రియల్లో ఉపయోగించడానికి పెద్దపెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో బ్లాక్‌చెయిన్‌ ఇంజినీర్లకూ, డెవలపర్‌లకూ డిమాండ్‌ పెరుగుతోంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. డిపాజిట్ ప‌రిమితిపై ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

పేమెంట్స్ బ్యాంక్‌ల‌లో వినియోగ‌దారుని డిపాజిట్ ప‌రిమితిని ఆర్‌బీఐ రెట్టింపు చేసింది. పేమెంట్స్ బ్యాంకులు చాలా కాలంగా డిపాజిట్ ప‌రిమితిని పెంచాల‌ని కోరుతున్నాయి. దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల బ్యాంకుల‌ను ప్రోత్స‌హించే ప్ర‌య‌త్నంలో, ఆర్‌బీఐ బుధవారం పేమెంట్స్ బ్యాంకుల గ‌రిష్ట డిపాజిట్స్‌ను రూ. 2 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు ప్ర‌క‌టించింది. అంత‌కుముందు ఈ గ‌రిష్ట ప‌రిమితి రూ. 1 ల‌క్ష మాత్ర‌మే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని