Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 22/09/2021 12:56 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. AP High Court: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోపై హైకోర్టు స్టే

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తితిదే బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

2. KTR: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు?: కేటీఆర్‌

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే విషయంపై మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. విలీనం చేయమని కొందరు కోరుతున్న వార్తలను తాను చదివినట్లు ఆయన తెలిపారు. ఈ వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విలీనంపై మీరేమంటారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

3. AP News: వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే డ్రగ్స్ దిగుమతి: బొండా ఉమ 

ఏపీలోని పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలిసే రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా జరుగుతోందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. డ్రగ్స్‌ దందాపై విచారణ జరిపించాలని డీఆర్‌ఐకి లేఖ రాస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో తయారవుతున్న మద్యంలో ఈ డ్రగ్స్‌నే వాడుతున్నారు. డ్రగ్స్‌ దందాలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఎంత వెళ్లిందో తేలాలి.

4. Tollywood Drugs Case: డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణకు తరుణ్‌

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? మాదకద్రవ్యాలు వినియోగించే సెలబ్రిటీలెవరైనా మీకు తెలుసా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

5. AP News: పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టుల పరారీ

ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. విధుల్లో ఉన్న పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

6. India corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

7. SAARC Meet: సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రద్దు

సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయింది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శనివారం ఈ సమావేశం జరగాల్సి ఉంది. తాలిబ్లన ఆధీనంలోని అఫ్గానిస్థాన్‌కు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించాలని పాక్‌ పట్టుబట్టినట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై భారత్‌ సహా మరికొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశం రద్దయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

8. Republic: కలెక్టర్‌గా సాయితేజ్‌.. ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయితేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ను బుధవారం ఉదయం చిరంజీవి విడుదల చేశారు.

* పెళ్లి సందD: ట్రైలర్‌ లాంఛ్‌ చేసిన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

9. ZEE Sony Pictures merger: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌-సోనీ పిక్చర్స్ విలీనం!

భారత మీడియా రంగంలో కీలక విలీనం ఒప్పందం దాదాపు ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌)’, ‘సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)’ మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది.

10. Pakistan Cricket: పాక్‌ పర్యటనకు రావొద్దని మేం ఇంగ్లాండ్‌కు చెప్పలేదు

పాకిస్థాన్‌లో భద్రతా కారణాల రీత్యా అక్కడికి రావొద్దని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుకు తాము చెప్పలేదని ఇస్లామాబాద్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ క్రిస్టియన్‌ టర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు అక్టోబర్‌లో పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, గతవారం న్యూజిలాండ్‌.. పాక్‌ పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగాక ఇంగ్లాండ్‌ బోర్డు సైతం తమ ప్లేయర్లను అక్కడికి పంపబోమని సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో  పాకిస్థాన్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ స్పందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని