Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/09/2021 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. By Election: హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చేసింది

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మూడు పార్లమెంట్‌, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్‌, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్‌, బద్వేలులో అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.. 

AP News: బద్వేలు ఉప ఎన్నిక.. వైకాపా, తెదేపా అభ్యర్థులు వీరే.?

2. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న గులాబ్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్‌ తుపాను ఎఫెక్ట్‌ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వరదలు, తెలంగాణలో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గువుతున్నాయి. బాధితులను ఆదుకోవడం కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తుపాను, వర్షాల ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. మరోవైపు వరదలతో తెలుగురాష్ట్రాల్లోని నదులు పొంగిపొర్లుతున్నాయి.

3. Crime news: గద్వాలలో రైలు కిందపడి అనంతపురం జిల్లా జంట బలవన్మరణం

రైలు కిందపడి జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల మండలం మేళ్ల చెరువు వద్ద చోటుచేసుకుంది. మృతి చెందిన యువతి, యువకుడిని అనంతపురం జిల్లా ధర్మవరం వాసులుగా గుర్తించారు. మృతులను గంగాధర్‌, లక్ష్మిగా పోలీసులు నిర్ధరించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

4. Pawan kalyan: వైకాపా ప్రభుత్వంపై పవన్‌ ఘాటు ట్వీట్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పలువురు ఘాటుగా స్పందించారు. దీనికి బదులుగా పవన్‌ ఓ ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్‌ చేశారు. తాజాగా పవన్‌ మరోసారి వైకాపా ప్రభుత్వంపై ఘాటు ట్వీట్‌ చేశారు. ‘‘వైకాపాది పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు నాశనమవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది’’ అని పేర్కొన్నారు. 

5. Corona :20వేలకు దిగువన కేసులు.. 200 లోపు మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. తాజాగా  కొత్త కేసులు 20వేల లోపే నమోదుకావడం ఊరట కలిగిస్తోంది. 201 రోజుల అనంతరం కొత్త కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇక మరణాలు కూడా 200లోపే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,795 కేసులు వెలుగులోకి వచ్చాయి.

6. Lata Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం.. రూపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ!

లతా మంగేష్కర్‌... ఆమె ఆసలు పేరు ‘హేమ’. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు... ఆమె వ్యక్తిత్వమూ బంగారమే. ముప్పై ఆరు ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషల్లో కలిపి 27వేల చలన చిత్ర గీతాల్లో ఆమె మనకు వినిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. ఆమె రాగాలు మన మనసును ఉత్తేజితం చేస్తే... ఆమె జీవనయానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. మంగళవారం ఆమె జన్మదినం సందర్భంగా లతా జీవన గీతాసారం... మీ కోసం...

James bond: అదృశ్య కారు.. కెమెరా ఉంగరం.. గాడ్జెట్స్‌లో బాండ్‌ గాడ్జెట్సే వేరయా!

7. Army: పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న సైన్యం..!

జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో భారత్‌ సైన్యం ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాది భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్‌ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు  దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా.. సైన్యం వాటిని విఫలం చేసింది.

8. North Korea: బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన ఉత్తరకొరియా..!

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష నిర్వహించింది. భవిష్యత్తులో ద.కొరియాతో శాంతి చర్చలు జరుగుతాయని ఉ.కొరియా గత శనివారం ఆశాభావం వ్యక్తంచేసింది. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించడం గమనార్హం.

9. Fianacial Planning : 30లలో ఈ తప్పులు చేయొద్దు!

డబ్బు ఒక శక్తిమంతమైన సాధనం. దాన్ని ఎంత తెలివిగా వినియోగించుకుంటే మన జీవితం అంత సాఫీగా ముందుకు సాగుతుంది. దీనికి ఒక నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా మన వయసు 30 ఏళ్లకు చేరిందంటే మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. ఈ వయసులో అసలైన బాధ్యతలు మన భుజాలపైకి వస్తాయి. రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం హాయిగా గడవాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే కీలకం. మరి ఈ వయసులో ఆర్థికంగా చేయకూడని కొన్ని తప్పులేంటో చూద్దాం..!

10. IPL 2021: ఏమైంది..! ముంబయి ఇలా ఎందుకు ఆడుతోంది?

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది?గత రెండు సీజన్లలో టైటిల్‌ సాధించి ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశిస్తున్న ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచింది. మరీ ముఖ్యంగా ఆదివారం రాత్రి బెంగళూరుతో తలపడిన సందర్భంగా 111 పరుగులకే కుప్పకూలి.. ఈ సీజన్‌పై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నా.. ప్లేఆఫ్స్‌ చేరాలంటే మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా ముంబయి ఆశలు గల్లంతే!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని