వ్యవసాయ రుణాల్లో రెండో స్థానంలో ఏపీ

తాజా వార్తలు

Published : 26/07/2021 23:39 IST

వ్యవసాయ రుణాల్లో రెండో స్థానంలో ఏపీ

దిల్లీ: వ్యవసాయ రుణాల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ పార్లమెంట్‌కు వివరాలు  వెల్లడించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అధిక సాగు రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ 63,22,415 ఖాతాలపై రూ.84,005.43 కోట్ల సాగు రుణం తీసుకుంది. ఒక్కో ఖాతాపై సగటున రూ.1,32,869 కోట్ల వ్యవసాయ రుణం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇక ఏపీలో మార్చి 31 నాటికి రూ.1,69,322 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఏపీలోని ఒక్కో ఖాతాపై సగటున రూ.1,41,004 రుణం ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని