Vaccine: ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు

తాజా వార్తలు

Updated : 25/04/2021 15:33 IST

Vaccine: ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు

ప్రజలు అపోహలు వీడాలి
ఏఐజీ ఆస్పత్రులు ఛైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయితే క్షేమంగా ఉండొచ్చని ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. దేశంలో వ్యాక్సిన్‌ ఇవ్వడం కొంత ఆలస్యమైందని.. ప్రభుత్వాలు కూడా దీనిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ఈటీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సినేషన్‌ బాగా జరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేస్తుందన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. 

‘‘కరోనా సోకిన వెంటనే సిటీ స్కాన్‌ అవసరం లేదు. ఐదు రోజుల తర్వాత చేయించుకోవాలి. సాధ్యమైనంత వరకు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలి. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే మిగతా వారు కూడా మాస్క్‌ ధరించాలి. వేసవి కావడంతో వీలైనంత ఎక్కువగా నీరు, పళ్ల రసాలు తీసుకోవాలి. మొదట్లో ప్రజలు వ్యాక్సిన్‌కు రాలేదు.. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. 

రెండో డోసు అనంతరం 15 రోజుల తర్వాత నుంచి పూర్తిస్థాయి రక్షణ లభించే అవకాశం ఉంది. అంటే తొలి డోసు తీసుకున్న 45 రోజుల తర్వాత సరిపడా యాంటీ బాడీలు పెరుగుతాయి. 3, 4 నెలల క్రితం కొవిడ్‌ సోకిన వారికి ఒక్క డోసుతోనే యాంటీబాడీలు వస్తున్నాయి. ప్రజలు భయడాల్సిన అవసరం లేదు. వైరస్‌ బారిన పడిన వారిలో 3 నుంచి 5 శాతం మంది మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. మిగతా దాదాపు 90శాతం పైగా ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తే థర్డ్‌ వేవ్‌ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి’’ అని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని