Cyclone Yaas: అప్రమత్తంగా ఉన్నాం: జగన్‌

తాజా వార్తలు

Published : 24/05/2021 13:25 IST

Cyclone Yaas: అప్రమత్తంగా ఉన్నాం: జగన్‌

తుపాను ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: ‘యస్‌’ తుపానుతో కొవిడ్‌ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం జగన్‌ కోరారు. కరోనా రోగులను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంటే వెంటనే చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. తుపాను సన్నద్ధతపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

ఈ సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని కోరారు. ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ ఇబ్బందులొస్తే ప్రత్యామ్నాయం చూడాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన సాంకేతిక సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తుపాను కదలికలను పరిశీలిస్తే స్వల్ప ప్రభావం ఉండే అవకాశముందని.. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అమిత్‌షాకు జగన్‌ తెలిపారు.

తుపాను సన్నద్ధతపై సీఎం జగన్‌ సమావేశం

అమిత్‌షాతో సమావేశం అనంతరం ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. కొవిడ్‌ రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని