రోగులే కృష్ణపట్నం మందుకు ప్రాచుర్యం తెచ్చారు
close

తాజా వార్తలు

Published : 19/06/2021 01:08 IST

రోగులే కృష్ణపట్నం మందుకు ప్రాచుర్యం తెచ్చారు

ఈటీవీ ముఖాముఖిలో ఆనందయ్య ఆసక్తికర అంశాలు 

కరోనా బారిన పడ్డ చాలామంది కృష్ణపట్నం ఆనందయ్య మందు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ ఆనందయ్య మందు తయారీలో బిజీబిజీ అయిపోయారు. మరి ఇంతకీ అసలు కృష్ణపట్నం మందు పంపిణీ ఎలా జరుగుతుంది? అన్ని జిల్లాలవారు ఈ మందు వాడుతున్నారా? లేకపోతే నెల్లూరు జిల్లాకే పరిమితమైందా? మందు తయారీకి, పంపిణీకి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? అసలు ఈ మందు ఎలా వాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆనందయ్య ఈటీవీ ముఖాముఖిలో పంచుకున్నారు.

1. ఎప్పటి నుంచి దీనిని మొదలు పెట్టారు? దీనిని కొవిడ్‌ మందుగా ఎందుకు తయారు చేయాలనుకున్నారు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది?
మా అమ్మగారు చేస్తుండేవారు. ఆ తర్వాత అన్ని విధాల మందు తయారు చేసేందుకు నాకు కొంత దైవత్వంతో సంభవించింది. గతేడాది కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని తయారు చేయడం.. మంచి ఫలితం రావడంతో కనీసం 60,70 మందికి ట్రీట్‌ చేశాం. దీనిని పేషంట్లే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

2. దీని మీద మీరు పుస్తకాలు కూడా చదువుతుంటారా?
నేను ఐటమ్స్‌ చదివే సమస్యే లేదు. భగవంతుడు దీన్ని వరంలా ఇచ్చాడు. దీన్ని ప్రజలకు అందజేస్తున్నా.

3. మీ ఆశయం.. రాష్ర్టంలో ఉండే సామాన్యులందరికీ మందు అందాలన్నది మీ మనసులో ఉండే కోరిక. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది?
నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం మొత్తానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. సర్వేపల్లి నియోజకవర్గానికి ఇవ్వడం పూర్తయింది. చంద్రగిరి నియోజకవర్గంలోనూ పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం మొత్తానికి సెంటర్లు పెట్టి అక్కడక్కడా పంచడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతులు అడిగాం. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి అక్కడక్కడా వచ్చి.. ఆసక్తి ఉన్నవారు తీసుకొనిపోయి సర్వీస్‌ చేస్తున్నారు.

4. ఈరోజు వరకూ ఎన్ని జిల్లాలు, ఎన్ని లక్షల మందికి ఈ మందు పంపిణీ చేశారు?
పాజిటివ్‌ కేసుల వాళ్లకే ఎక్కువ ఇస్తున్నాం. ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరుకి పంపాం. ఇతర జిల్లాల్లోంచి వచ్చేదాన్ని బట్టి మేము ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం.

5. ‘పీ’ మందు ఎలా వాడాలో అవగాహన కలగడం లేదు. దీన్ని ఎలా వాడాలి చెప్పండి?
‘పీ’ మందుకొక టైమింగ్‌ అనేది లేదు.  దాన్ని ఎప్పుడైనా వాడవచ్చు. ‘పీ’ అనేది బటాని గింజ అంత వేసి చప్పరించాలి. మింగకూడదు. చప్పరించాక పది నిమిషాల్లో ‘ఎఫ్‌’ అప్లై చేసి ఆహారంతో తీసుకోవాలి. ఓ మాత్ర వేసుకోవడం, కొద్దిగా తీసుకోవడం.. ఈ విధంగా ఓ గోలి అంత తీసుకోవాలి. ‘ఎఫ్‌’ వచ్చి ఆరు గ్రాములు, ‘ఎల్‌’కి, దానికి మూడు నాలుగు గంటల గ్యాప్‌. ‘ఎల్‌’ తీసుకొని ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందుకాని తీసుకొని, తరవాత ఆహారం తీసుకోవాలి. మళ్లీ సాయంత్రం ‘పీ’ తీసుకొని చప్పరించేస్తే.. మనకు పాజిటివ్‌ థింగ్స్‌ వస్తున్నాయి. రెండోరోజు యథావిధిగా వాడాలి. మూడో రోజు మాత్రం ‘పీ’ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. 

చిన్నపిల్లలకు పెద్దలు తీసుకునే మోతాదులో తగ్గించి సగం మోతాదులో ఇవ్వాలి. ఏడాది నుంచి నూరేళ్ల వయస్సు గలవారు ఎవరైనా ఈ మందును వాడుకోవచ్చు. రెండోది గర్భవతులకు స్త్రీ బహిష్టు సమయంలో తప్ప అన్ని వేళలా దీన్ని వాడుకోవచ్చు. పాజిటివ్‌ కేసులు వచ్చిన వాళ్లు మాత్రం 10-15 రోజులు మాంసాహారం తినకపోవడం చాలా మంచిది. మందు తీసుకున్న ఇతరులు మాత్రం ఒక్కరోజు మాంసాహారం ముట్టకూడదు.

6. సోషల్‌ మీడియాలో ఫార్ములా హల్‌చల్‌ అవుతుంది. మందుని తయారు చేసేస్తున్నారు. అదేమైనా నకిలీ మందు అంటారా?అది వాడటం వల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా?
కొంతమంది మోషన్స్‌ అవుతున్నాయని చెబుతున్నారు. ఫార్ములా కరెక్ట్‌ అని నేను ఎలా చెప్పను!? అది చేసేదాన్ని బట్టి ఉంటుంది. దీనికి ప్రభుత్వం స్పందించి వారిని కఠినంగా శిక్షిస్తే, ఇంకొకరు చేయరు. లేకపోతే ప్రజలు నష్టపోతారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన రోజులు వస్తాయి. ఇన్‌స్ట్రుమెంట్స్‌ను మేం సెట్‌ చేసుకున్న తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తాం. ప్రభుత్వమైతే అనుమతి ఇచ్చేంత వరకూ సహకరించింది కానీ.. తర్వాత నుంచి నిల్‌.

7. కార్పొరేట్‌ సంస్థలు అనేక మంది మిమల్ని కలుస్తున్నారు. వాళ్లు తయారు చేసుకుంటున్నారనేది కూడా వచ్చింది. ఇవి ఆరోపణలు అంటారా?లేదా ఈ విధానం కూడా మంచిదే అంటారా?
ఏవిధంగా అందజేసినా.. కార్పొరేట్‌ సంస్థలు లేదా ప్రజాప్రతినిధులు, సేవా సంఘాలు అందజేసినా.. ఇవి ప్రజలకు వెళతాయి. కాబట్టి.. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. వాళ్లొచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. వాళ్లు కొంత స్పాన్సర్‌ చేస్తున్నారు. అలాగే విరాళాలు కూడా ఇస్తున్నారు.

8. భవిష్యత్తులో ఇతర వ్యాధుల విషయంలోనూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా?
నాకు చాలా రకాలైన మందులు ఇచ్చే అలవాటు ఉంది. 20-25 వ్యాధులను నయం చేసే శక్తిని భగవంతుడు నాకు అందించాడు. అవి కూడా తొందరలో ఆలోచించి, అందరం కూర్చొని, దాని ఏవిధంగా నడపాలో చర్చించుకుని ముందుకు వెళ్తాం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని