Anand Mahindra: మహీంద్రా విసిగిపోయారట..!

తాజా వార్తలు

Published : 09/06/2021 18:42 IST

Anand Mahindra: మహీంద్రా విసిగిపోయారట..!

కరోనా వేరియంట్లతో పిల్లలకు కొత్త భాష అంటూ చమత్కారం

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా వర్తమాన అంశాలకు తన హాస్యచతురతను జోడించి, ట్వీట్లతో చమత్కరిస్తుంటారు. ఆయన నెట్టింట్లో పంచుకునే ట్వీట్లే అందుకు నిదర్శనం. కరోనాకు సంబంధించిన అంశాలు వాటిలో ప్రస్తావనకొస్తాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి కొత్త రూపాలను సంతరించుకుంటూ మానవాళికి సవాలు విసురుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్ఫా, బీటా, గామా,.. అంటూ నామకరణం చేసింది. మరో కొత్త రకం N440K రకం గురించి ఓ ఆంగ్ల పత్రిక ద్వారా తెలిసింది. అది చూసిన ఆయనకు విసుగు పుట్టిందట, ఈ కొత్తపేర్లన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయట. ఇదే విషయాన్ని ట్వీట్ చేసి, చెప్పారు.

‘ఆల్ఫా-B.1.1.7, బీటా-B.1.351, గామా-P1, డెల్టా-B.1.617.2... ఇప్పుడు N440K. నేను విసిగిపోయాను. గందరగోళానికి గురయ్యాను. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు పాఠశాలల్లో కొత్త భాషను ఎంచుకోవాలేమో. వారు ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొవిడిష్‌ను ఎంపిక చేసుకోవచ్చు’ అంటూ తన చిరాకును చమత్కారంగా ప్రదర్శించారు. ఈ N440K రకం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల్లో వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని