ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక

తాజా వార్తలు

Published : 13/02/2021 01:25 IST

ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక

విభిన్న ప్రకటనను ట్వీట్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర

దిల్లీ: ‘ప్రేమికుల దినోత్సవం రోజు ప్రియమైన వ్యక్తులకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే వారిని సురక్షితంగా ఉంచేందుకు ఒక వ్యాక్సిన్‌ను అందించండి’.. అంటూ వినూత్నంగా సాగుతోంది ఓ ప్రకటన. ఫైజర్‌ సంస్థ లోగోతో ఉన్న ఈ పేరడీ ప్రకటనలో వ్యాక్సిన్‌ను ప్రేమికుల దినోత్సవ బహుమతిగా ఇవ్వమంటోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఈ ప్రకటన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాకు ఎంతగానో నచ్చిందట. వెంటనే ఆయన తన ట్విటర్‌ ఖాతాలో దాన్ని పోస్టు చేశారు. ఆ పోస్టులో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలాను ప్రస్తావిస్తూ..మీ కోసం అడ్వర్టైజింగ్‌ బ్రీఫ్‌ సిద్ధంగా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ ప్రకటనలో ఏముందంటే.. ఇక వ్యక్తి తన స్నేహితురాలికి ఉంగరం బదులుగా వ్యాక్సిన్‌ షాట్‌ను అందిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ ప్రకటన చివరిలో ‘టీకా తీసుకోండి..ప్రేమతో..’ అంటూ ముగుస్తోంది.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. నిమిషానికి 5వేల వ్యాక్సిన్‌ డోసులను తాము తయారు చేస్తున్నట్లు సీరం సీఈవో అదర్‌పూనావాలా గతంలో తెలిపారు. ఇప్పటికే ఈ టీకాలను కోరుతూ అనేక దేశాలు తమను సంప్రదించాయని ఆయన వెల్లడించారు.

అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ ఈ ప్రకటనను మొదటగా పోస్టు చేయగా, ఇప్పటి వరకూ లక్షల మంది చూశారు. ఈ ప్రకటనపై నెటిజన్లు వాలంటైన్‌ టీకా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి..

కేంద్రం, ట్విటర్‌కు సుప్రీం నోటీసులు

అందంగా మారాలనుకుంటే..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని