Krishnapatnam: ఎక్కువ మందికి లబ్ధి చేకూరాలి: రాములు

తాజా వార్తలు

Published : 31/05/2021 20:02 IST

Krishnapatnam: ఎక్కువ మందికి లబ్ధి చేకూరాలి: రాములు

మంగళగరి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుతో ఎక్కుమందికి లభ్ది చేకూరుతుందని నమ్ముతున్నట్లు ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు.  ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో కలిసి మంగళగిరిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆనందయ్య ఔషధం వల్ల కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదన్నారు. ఈ మందువల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌, నష్టం జరిగిందనేందుకూ ఆధారాలు లేవన్నారు.  మరోవైపు కంటిచుక్కల మందువల్ల హాని జరగదనేందుకు కూడా ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాలు తెలిసేందుకు మరో 3 వారాల సమయం పట్టవచ్చని రాములు తెలిపారు. 

ఆనందయ్య మందులో పీ,ఎల్‌, ఎఫ్‌, కే, కంటి చుక్కల మందు ఉన్నాయని, వాటిలో 90-95 శాతం మంది పీ, ఎల్‌, ఎఫ్‌ రకాలనే వినియోగించారని రాములు తెలిపారు. ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదని పునరుద్ఘాటించారు. మందు పంపిణీపై గురువారం హైకోర్టు నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఔషధ విషయమై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని అన్నారు. ఔషధంపై చర్చలు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు.

వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం: సింఘాల్‌

అంతకుముందు అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్ర సాంకేతిక కమిటీ ప్రొటోకాల్‌ను పాటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ వినియోగం తగ్గిందని అన్నారు. అయితే, కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని, కర్ఫ్యూ అమలు తర్వాత కేసులు తగ్గాయని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని