ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, జరిమానా!

తాజా వార్తలు

Published : 01/01/2021 01:36 IST

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష, జరిమానా!

తీర్పు వెలువరించిన హైకోర్టు

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో 2017లో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు గత వారం న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చోవాలని శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజులు సాధారణ జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి..

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌కు రైతుల ఘన వీడ్కోలు

మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని