విశాఖలో మరోసారి పేలుడు

తాజా వార్తలు

Published : 04/08/2020 12:23 IST

విశాఖలో మరోసారి పేలుడు

విశాఖపట్నం: విశాఖలో మరోసారి పేలుడు ఘటన చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో  మంగళవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో ఉన్న రెండు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి దగ్గరలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. పేలుడు ఘటనతో కంపెనీలోని కార్మికులు భయంతో పరుగులు తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని