AP News: కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ

తాజా వార్తలు

Updated : 11/06/2021 14:19 IST

AP News: కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ రెండోరోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఆయన భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్‌ చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్‌.. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. దాదాపు గంటకు పైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం సమావేశం కొనసాగింది. అనంతరం పీయూష్‌లో గోయల్‌తో జగన్‌ సమావేశమై రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అంశాలపై చర్చించారు.

తొలిరోజు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్‌షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ తదితరులతో జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. మూడు రాజధానులతో పాటు పోలవరం నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చర్చించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని