ఏపీలో నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల 
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 00:32 IST

ఏపీలో నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల 

అమరావతి: ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమగ్ర సమాచారాన్ని శాఖల వారీగా సేకరించి ఖాళీల నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జాబ్‌ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లో అవసరాల మేరకు ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఆర్థికశాఖ ఆమోదంతో విడతలవారీగా పరీక్షలు చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌తో  కలిపి మొత్తం 10,143 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని