జాతీయ డిజిటల్‌ టూరిజం మిషన్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్య రాష్ట్రంగా ఏపీ

తాజా వార్తలు

Published : 28/07/2021 19:59 IST

జాతీయ డిజిటల్‌ టూరిజం మిషన్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్య రాష్ట్రంగా ఏపీ

అమరావతి: జాతీయ డిజిటల్‌ టూరిజం మిషన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియతో పాటు మార్కెట్‌ విస్తృతి, నిర్వహణ సమార్థ్యాల పెంపు, పర్యాటక అవకాశాలను మెరుగుపర్చటం వంటి అంశాలపై టూరిజం టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. అవకాశాలతో పాటు పర్యాటక రంగంలో రవాణా, ఆతిథ్యం తదితర రంగాల్లోని సవాళ్లనూ టూరిజం టాస్క్‌ ఫోర్స్‌ మిషన్‌ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆతిథ్యరంగం, ఆహార సేవలు, రవాణా తదితర అంశాలపై కూడా నివేదిక ఇవ్వనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని