ఆ వ్యాక్సిన్లను మాకు కేటాయించండి: జగన్‌

తాజా వార్తలు

Published : 29/06/2021 20:44 IST

ఆ వ్యాక్సిన్లను మాకు కేటాయించండి: జగన్‌

కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీకి జగన్‌ లేఖ

అమరావతి: ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించని వాక్సిన్లను ప్రభుత్వానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్‌ మఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించి ప్రధానికి జగన్‌ మరోసారి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం వాక్సిన్లు కేటాయిస్తుందని.. అయితే నిర్దేశించిన వాక్సిన్లను వారు వినియోగించలేక పోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల వద్ద పెద్దఎత్తున వ్యాక్సిన్లు మిగిలిపోతున్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు. జూలై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారని.. ఇంత పెద్ద మొత్తంలో వాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులు కేవలం 2,67,075 వాక్సిన్లను మాత్రమే వినియోగించుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాక్సిన్లు వేసే అవకాశం ఉన్నప్పటికీ తగినన్ని డోసులు లేకపోవడంతో వాక్సినేషన్ నెమ్మదిస్తోందన్నారు. వాక్సినేషన్ వేగవంతం చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు తీసుకోని వాక్సిన్ నిల్వలను ప్రభుత్వానికి కేటాయించాలని విన్నవించారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు ఇదే అంశాలు ప్రస్తావించాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వాక్సినేషన్ వేయాలని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని