జాగ్రత్తలు పాటిస్తూనే యుద్ధం చేయాలి: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాగ్రత్తలు పాటిస్తూనే యుద్ధం చేయాలి: జగన్‌

అమ‌రావ‌తి: వ్యాక్సినేష‌న్ పూర్తి అయితేనే కొవిడ్‌ను పూర్తిస్థాయిలో నివారించ‌వ‌చ్చ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. రైతు భరోసా నిధుల విడుదల అనంతరం కొవిడ్‌ పరిస్థితులపై సీఎం మాట్లాడారు. ''దేశానికి 172 కోట్ల డోసులు కావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 18 కోట్ల వ్యాక్సిన్లే ఇవ్వ‌గ‌లిగారు. ఏపీలో మొత్తంగా 7 కోట్ల డోసులు కావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం 73 ల‌క్ష‌ల డోసులు మాత్ర‌మే పంపిణీ చేసింది.

దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్లు త‌యారు చేస్తున్నాయి. భార‌త్ బ‌యోటెక్ నెల‌కు కోటి వ్యాక్సిన్లు త‌యారు చేస్తోంది. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్‌కు నెల‌కు 6 కోట్ల త‌యారీ సామ‌ర్థ్యం ఉంది. దేశంలో కేవ‌లం 7 కోట్ల వ్యాక్సిన్ల త‌యారీ సామ‌ర్థం ఉంది. కొవిడ్‌తో స‌హ‌జీవ‌నం చేస్తూనే దాంతో యుద్దం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మాస్కులు, భౌతిక దూరం పాటించ‌డం, చేతులు శుభ్రం చేసుకోవాలి. నిబంధ‌న‌లు, జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే కొవిడ్‌పై యుద్ధం చేయాలి''  అని జ‌గ‌న్ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని