AP News: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

తాజా వార్తలు

Updated : 08/06/2021 11:48 IST

AP News: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

అమరావతి: పీఎంఏవై కింద గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం జగన్‌ కోరారు. దీనికోసం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,104 కోట్లు ఖర్చవుతాయని.. ఇప్పటికే ఇళ్లపట్టాలు, నిర్మాణాలకు రూ.23,535 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రయోజనముండదని.. పెద్దమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం సాధ్యపడట్లేదని తెలిపారు. పీఎంఏవై కింద అందుతున్న నిధులు అవసరాలను తీర్చలేకపోతున్నాయన్నారు. ఆ పథకం కింద రాష్ట్రాలకు సమృద్ధిగా నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని జగన్‌ కోరారు. మౌలిక వసతులకు నిధులిచ్చేలా సంబంధిత శాఖను ఆదేశించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని