వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు: జగన్‌

తాజా వార్తలు

Updated : 03/08/2021 17:25 IST

వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు: జగన్‌

అమరావతి: ఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలకు ఇంటర్నెట్‌ తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిజిటల్‌ లైబ్రరీలతో ప్రాథమిక, మాధ్యమిక విద్య, డిగ్రీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. డిజిటల్‌ లైబ్రరీల్లో అన్ని పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌  లభ్యమయ్యేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌  సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం  చేపట్టాలని, ఈనెల 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని