ఐటీ కేంద్రంగా విశాఖ: జగన్‌
close

తాజా వార్తలు

Published : 23/06/2021 17:51 IST

ఐటీ కేంద్రంగా విశాఖ: జగన్‌

అమరావతి: యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్స్‌, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం సమీక్షించారు. పిల్లలకు అత్యున్నత నైపుణ్యాలు నేర్పించాలని ఆదేశించారు. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రమవుతుందన్నారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యకు విశాఖను కేంద్రంగా చేయాలని ఆదేశించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని విశాఖలో తీసుకురావాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఉంటాయని సీఎం వెల్లడించారు.

కనీసం ఒక ఏడాది పాటు ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలన్నారు. వర్క్‌ ఫ్రం హోం కార్యాచరణ బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలకు మంచి సామర్థ్యమున్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్కడి నుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుందన్నారు. డిసెంబరు కల్లా సుమారు నాలుగువేల గ్రామాలకు ఇంటర్‌నెట్‌ కనెక్టవిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని