అవినాష్‌రెడ్డి బౌలింగ్‌.. జగన్‌ బ్యాటింగ్‌

తాజా వార్తలు

Published : 10/07/2021 01:06 IST

అవినాష్‌రెడ్డి బౌలింగ్‌.. జగన్‌ బ్యాటింగ్‌

కడప: సభలు, సమావేశాలు, సమీక్షలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కాసేపు సరదాగా క్రికెట్‌ ఆడారు. రెండు రోజుల పాటు కడప, అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కడపలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో రూ.4 కోట్ల వ్యయంతో ఫ్లడ్‌ లైట్ల ఏర్పాటుకు  సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేడియం సిబ్బంది కోరిక మేరకు కాసేపు బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బౌలింగ్‌ వేయగా.. సీఎం జగన్‌ బ్యాటింగ్‌ చేశారు. సీఎం బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపూ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్టేడియం సిబ్బంది సందడి చేశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని