close

తాజా వార్తలు

Updated : 04/05/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona: ఏపీలో భారీగా కొత్త కేసులు 

అమరావతి: ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయినట్టు  ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టంచేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కేసులు

గడిచిన 24గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398 కొత్త కేసులు రాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 793 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లాలో 12మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. అనంతపురం జిల్లాలో 9మంది, తూర్పుగోదావరి 9, విశాఖ 9, విజయనగరం 9, నెల్లూరు 7, కృష్ణా 6, గుంటూరు 5, చిత్తూరు 4, కర్నూలు 4, ప్రకాశం 4, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజాగా 12,207మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,68,33,932 శాంపిల్స్‌ పరీక్షించగా.. 11,84,028మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,16,142మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8289మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 క్రియాశీల కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే..

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని