‘ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదు’

తాజా వార్తలు

Published : 09/01/2021 00:55 IST

‘ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదు’

ఎస్‌ఈసీ లేఖకు సమాధానమిచ్చిన సీఎస్‌

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పరస్పరం లేఖలు రాసుకున్నారు. ఎస్‌ఈసీ రాసిన లేఖకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ జవాబు ఇచ్చారు. ఎస్‌ఈసీతో భేటీ కంటే ముందే సీఎస్‌ తన లేఖను ఎన్నికల సంఘానికి పంపారు‌. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ సాధ్యమన్నారు. ప్రస్తుతం టీకా అందించే ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని సీఎస్‌ స్పష్టం చేశారు‌. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేస్తుందన్న ఆరోపణలను ఆదిత్యనాథ్‌ దాస్‌ ఖండించారు‌. కొవిడ్‌ కారణంగానే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావట్లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరికాదని సీఎస్‌ తన లేఖలో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని