AP News: కారుణ్య నియామకాలపై త్వరగా చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ సమీర్‌శర్మ

తాజా వార్తలు

Published : 21/10/2021 19:19 IST

AP News: కారుణ్య నియామకాలపై త్వరగా చర్యలు తీసుకోవాలి: సీఎస్‌ సమీర్‌శర్మ

అమరావతి: కేబినెట్‌ నిర్ణయాల అమలు, పెండింగ్‌ అంశాలపై ఇక నుంచి ప్రతినెలా మొదటి బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ..  ఈ-ఫైలింగ్‌, కోర్టు కేసులు, పదోన్నతులపై డీపీసీల ఏర్పాటు, సీఎం హామీల అమలు తదితర అంశాలపై అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్‌ సమావేశం నిర్వహించారు.  ముఖ్యమంత్రి హామీలపై తీసుకున్న చర్యలపై శాఖలవారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నవంబరు 30 కల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని మెమో జారీ చేశారు. ఆర్థికేతర అంశాల అమలులో భాగంగా ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఈ-ఫైలింగ్‌ విధానాన్ని మరింత పటిష్టం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.  గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి హెచ్‌ఓడీ, ముఖ్య కార్యదర్శి వరకూ ఇక నుంచి ఈ-ఫైలింగ్‌ ద్వారానే దస్త్రాలు రూపొందించాలని సూచించారు. ఇక నుంచి మాన్యువల్‌ ఫైళ్లను క్రమంగా తగ్గించాలన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక యూనిక్‌ ఐడీ ఇవ్వాలని ఐటీశాఖ కార్యదర్శికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలన్న అంశాలపై దృష్టి పెట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

మరో వైపు కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వ న్యాయవాదులు ముందస్తు సమాచారం ఇవ్వటంతో పాటు కోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం లైజనింగ్‌ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోర్టు ఉత్తర్వుల అమలు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.  2019 నుంచి ఇప్పటి వరకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాల్లో రెవెన్యూశాఖలోనే ఎక్కువశాతం పెండింగ్‌లో ఉన్నట్టు సమావేశంలో సీఎస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో 55,500 మంది ఉద్యోగులను ప్రభుత్వంలో తీసుకున్నందున కేడర్‌ స్థాయిని నిర్థారించిల్సిన అంశంపైనా సమావేశంలో చర్చించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని