Ap News: అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులే!

తాజా వార్తలు

Published : 28/05/2021 16:29 IST

Ap News: అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులే!

అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పలు ఆస్పత్రులు కనీస మానవత్వం మరిచి కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తప్పు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీచేయడం, జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే, ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

సీఎం ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే పది రెట్ల పెనాల్టీ విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండోసారి కూడా ఇదేవిధమైన తప్పిదాలకు పాల్పడితే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 లేదా అంతకు మించి పడకలున్న ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. 50 నుంచి 100 పడకలున్న ప్రైవేటు ఆస్పత్రులు 500 ఎల్‌పీఎమ్‌ కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 100కు పైగా పడకలున్న ప్రైవేటు ఆస్పత్రులు 1000 ఎల్‌పీఎమ్‌ కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో తెలిపారు. ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు తప్పకుండా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 50 బెడ్ల కంటే తక్కువ బెడ్లు ఉన్న ఆస్పత్రులు కూడా ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని