close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని ఆదేశించింది. సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాలల్లోని పీజీ కోర్సులకు సైతం ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్‌, అఫిలియేషన్‌, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ హెచ్చరించింది.

కోర్సులు.. వాటి వార్షిక ఫీజుల వివరాలు...

* మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ - రూ.27,000
* కెమిస్ట్రీ - రూ.33,000
* బయోటెక్నాలజీ - రూ.37,400
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ - రూ.24,200
* జెనెటిక్స్‌ - రూ.49,000
* ఎంఏ, ఎంకామ్‌ - రూ.15,000 నుంచి రూ.30,000


 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని