పరీక్షలపై సుప్రీంలో ఏపీ అఫిడవిట్‌
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 18:06 IST

పరీక్షలపై సుప్రీంలో ఏపీ అఫిడవిట్‌

అమరావతి: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. 

 బోర్డు పరీక్షల నిర్వహణతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే.  పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వాటి నిర్వహణపై వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్‌ దాఖలు చేసింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని