Krishnapatnam: ఆ త‌ర్వాతే ఐ డ్రాప్స్‌

తాజా వార్తలు

Updated : 03/06/2021 14:41 IST

Krishnapatnam: ఆ త‌ర్వాతే ఐ డ్రాప్స్‌

హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య చుక్క‌ల మందుపై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఆనంద‌య్య చుక్క‌ల మందుకు సంబంధించిన నివేదిక అందింద‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు వివ‌రించింది.  చుక్క‌ల మందు వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు ఉండ‌వ‌ని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్‌, నిల్వ‌కు నెల నుంచి మూడు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం కోర్టుకు వివ‌రించింది. ఇందువ‌ల్ల మూడు నెల‌ల తర్వాత పంపిణీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. లంచ్ విరామం నేప‌థ్యంలో హైకోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది. అనంత‌రం ఆనంద‌య్య‌, పిటిష‌న‌ర్ల వాద‌న‌లు ధర్మాస‌నం విన‌నుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని