AP News: కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంకు ఏపీ

తాజా వార్తలు

Updated : 14/07/2021 13:26 IST

AP News: కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంకు ఏపీ

అమరావతి: పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్ధమైన నీటి వాటాను తెలంగాణ రానీయట్లేదని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ‘‘శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. వారి తీరుతో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధం. ఆ రాష్ట్ర వైఖరి మా ప్రజల జీవించే హక్కును హరించేలా ఉంది. విభజన చట్టంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయాలు అమలు చేయడం లేదు. కేఆర్‌ఎంబీ, కేంద్రం ఆదేశాలను తెలంగాణ అమలు చేయడం లేదు’’ అని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని