Krishnapatnam: ఆనందయ్య మందుకు గ్రీన్‌ సిగ్నల్‌

తాజా వార్తలు

Updated : 31/05/2021 16:02 IST

Krishnapatnam: ఆనందయ్య మందుకు గ్రీన్‌ సిగ్నల్‌

అమ‌రావ‌తి:  నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

పంపిణీ వద్దకు కొవిడ్‌ రోగులు వెళ్లొద్దు..

కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అవి రావ‌డానికి 2- 3 వారాలు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది. కె అనే మందును క‌మిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్‌ దీనికి నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వాడితే క‌రోనా త‌గ్గుతుంద‌నడానికి నిర్ధార‌ణ‌లు లేవ‌ని నివేదిక‌లు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగ‌తా మందులు వాడ‌కుండా ఉండొద్ద‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య ఇచ్చే పి,ఎల్‌,ఎఫ్ మందులు వాడొచ్చ‌ని స్పష్టం చేసింది. ఆనంద‌య్య ఔష‌ధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్ద‌ని.. వారి బంధువులే వెళ్లాలని సూచించింది. మందు పంపిణీ వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. 

కంటిలో వేసే డ్రాప్స్‌పై నివేదికివ్వండి:  హైకోర్టు

ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్‌పై ఈరోజు ఉదయం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఔష‌ధంపై రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తెల‌పాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదిని కోర్టు కోరింది. ఈ విష‌యంపై ఈరోజు ప్ర‌భుత్వం స‌మీక్ష జ‌రుపుతుంద‌ని న్యాయ‌వాది వివ‌రించారు. చ‌ట్ట‌ ప్ర‌కారం ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని ఆనంద‌య్య త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరో దఫా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని