తితిదే అర్చకుల కొనసాగింపుపై నోటిఫికేషన్‌
close

తాజా వార్తలు

Published : 10/04/2021 11:43 IST

తితిదే అర్చకుల కొనసాగింపుపై నోటిఫికేషన్‌

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో అర్చకుల కొనసాగింపుపై దేవదాయ శాఖ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వంశపారపర్యంగా కొనసాగే అర్చకులకు 2 విధానాలు అమలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. నిర్ణీత వేతనం పొంది.. విధులు నిర్వర్తిస్తూ 65 ఏళ్లకు పదవీ విరమణ చేసి కుమారుడికి అర్చకత్వం కోసం నామినేట్‌ చేసుకునేందుకు వెసలుబాటు ఇచ్చింది. దీంతో పాటు తితిదే నిర్ణయించిన సంభావనతో ఆరోగ్యంగా ఉన్నంత కాలం పని చేసే వెసలుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. సంభావనతో ఆరోగ్యంగా ఉన్నంతకాలం పని చేసి అనంతరం కుమారుడిని నామినేట్‌ చేసే వీలు కూడా కల్పించింది. ఈ రెండు విధానాల్లో అర్చకులు ఒకటే ఎంపిక చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని