విశాఖ తీరంలో ‘నౌక’ రెస్టారెంట్‌!

తాజా వార్తలు

Published : 19/12/2020 00:46 IST

విశాఖ తీరంలో ‘నౌక’ రెస్టారెంట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇలీవల విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓడను కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఓడను రూ.10 కోట్లతో కొనుగోలు చేసి అక్కడే రెస్టారెంట్‌గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తీవ్ర వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన వాణిజ్య నౌక ‘ఎమ్‌వీ మా’ ఔటర్‌ హార్బర్‌ నుంచి నాలుగు నాటికల్‌ మైళ్లు ప్రయాణించి విశాఖలోని తెన్నీటి పార్కు వద్ద తీరానికి కొట్టుకువచ్చింది. అయితే దాన్ని తిరిగి జలాల్లోకి తరలించేందుకు భారీ మొత్తంలో ఖర్చు కానున్న నేపథ్యంలో ఇక్కడే ఉంచి రెస్టారెంట్‌గా మార్చాలని భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి హోటల్‌గా మార్చాలనుకుంటోంది. దీనిపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో పర్యాటకశాఖ మంత్రి సమావేశమై చర్చలు జరిపారు. ఈ మేరకు బంగ్లాదేశీ ఓడ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఓడను కొనుగోలు చేసిన తర్వాత పర్యాటకులను ఆకర్షించే విధంగా ఓడలో మార్పులు చేపట్టి రెస్టారెంట్‌గా మార్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి...

స్విమ్మింగ్‌పూల్‌.. రిజర్వాయర్లే డైనింగ్‌ హాళ్లు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని