AP News: జ‌డ్జి రామ‌కృష్ణ‌కు బెయిల్
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 12:55 IST

AP News: జ‌డ్జి రామ‌కృష్ణ‌కు బెయిల్

అమ‌రావ‌తి: సస్పెండైన జడ్జి రామ‌కృష్ణ‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీక‌త్తుతో బెయిల్ ఇచ్చిన ధ‌ర్మాస‌నం.. విచార‌ణాధికారికి స‌హ‌కరించాల‌ని ఆదేశించింది. రాజద్రోహం కేసులో అరెస్టయిన జడ్జి రామకృష్ణ.. బెయిల్ కోసం ఉన్నత న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ష‌రతుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. కేసు అంశంపై మీడియాతో మాట్లాడొద్ద‌ని ఆయ‌న్ను ఆదేశించింది. జడ్జి రామకృష్ణ ప్ర‌స్తుతం పీలేరు స‌బ్‌జైలులో ఉన్నారు. 

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్లో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య దీనిపై ఫిర్యాదు చేయగా.. జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని