పరిషత్‌ ఎన్నికలపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

తాజా వార్తలు

Updated : 07/04/2021 11:42 IST

పరిషత్‌ ఎన్నికలపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

అమరావతి: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈపిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం‌ బుధవారం ఉదయం విచారణ చేపట్టింది. ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వర్ల రామయ్య తెదేపా తరఫున పిటిషన్‌ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్‌ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్‌లో సరైన వివరాలు లేవని ఎస్‌ఈసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన పేపర్లతో మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందుకు రావాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని