జగన్‌ కేసుల ఉపసంహరణపై విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Published : 23/06/2021 20:36 IST

జగన్‌ కేసుల ఉపసంహరణపై విచారణ వాయిదా

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో గతంలో నమోదైన వివిధ క్రిమినల్‌ కేసులను పోలీసులు, ఫిర్యాదు దారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడంపై  ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. మొదట ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని హైకోర్టు తెలపగా.. వాదనలు వినిపించిన తర్వాత నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను సుమోటోగా తీసుకోవడం అరుదుగా జరుగుతుందని ఏజీ వాదించారు. జ్యూడీషియల్‌ గ్రౌండ్స్‌లో జరగాల్సిన అంశాన్ని అడ్మినిస్ట్రేటివ్‌ అంశంగా చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈవిషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత నోటీసులు ఇవ్వాలని ఏజీ కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 25కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని