AP High Court: సరిపడా ప్లాంట్లు ఎప్పుడు?
close

తాజా వార్తలు

Updated : 19/05/2021 14:34 IST

AP High Court: సరిపడా ప్లాంట్లు ఎప్పుడు?

ఆక్సిజన్‌ సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు


 

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరానికి తగినట్లు రెమిడెసివిర్‌ సరఫరా జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని.. డిమాండ్‌కి సరిపడా ఆక్సిజన్‌ సరఫరా కేంద్రం నుంచి జరగడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తక్కువ కేసులున్న తెలంగాణకు 690 టన్నులు ఇచ్చి.. ఎక్కువ కేసులున్న ఏపీకి 580 టన్నులే ఇచ్చారని తెలిపింది. 

దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇలా ఎలా చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాల అవసరాలకు సరిపడా సరఫరా బ్యాలెన్సింగ్‌ చేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవసరానికి సరిపడా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఎప్పుడు చేస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా.. మూడునెలల సమయం పడుతుందని కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇది చాలా ఎక్కువ సమయమని.. వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించింది కంప్రెషర్ల తయారీలో జాప్యం జరుగుతోందని.. జూన్‌ మొదటివారంలో 15 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులు నోడల్ అధికారి ద్వారా చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని