AP High Court: కేంద్రంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

తాజా వార్తలు

Updated : 04/06/2021 14:38 IST

AP High Court: కేంద్రంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

అమరావతి: బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను సమకూర్చటంలో కేంద్రప్రభుత్వం సరిగా వ్యవహరించటం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేత్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసుని విచారించింది. ప్రధానంగా బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స, కొవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది. దీనిపై కేంద్రప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను హైకోర్టుకు అందజేసింది. బ్లాక్ ఫంగస్ రోగులకు అందించాల్సిన ఆంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్ల సరఫరా చాలా తక్కువగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 

ఇంజక్షన్ల తయారీకి అవసరమైన ముడిసరుకు లభ్యత తక్కువగా ఉందని కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. విదేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుని ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు వివరించారు. రోగులకు అవసరమైన మేర మందులు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఏ రాష్ట్రానికి ఎంతమేర సరఫరా చేశారో వివరాలు ఇవ్వాలని సూచించింది. కొవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని