విశాఖ భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
close

తాజా వార్తలు

Updated : 23/04/2021 13:21 IST

విశాఖ భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఐదు చోట్ల భూముల అమ్మకానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట అమ్మకాలపై స్టే ఇచ్చిన విషయాన్ని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికీ వర్తిస్తాయని.. టెండర్లు ఖరారు చేయొద్దని స్పష్టం చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు ఖరారుపై కోర్టు తీర్పునకు లోబడే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని