పరిషత్‌ ఎన్నికలపై విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 15:50 IST

పరిషత్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై దాఖలపై పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా నేత వర్ల రామయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్‌ జడ్జి విచారణ జరిపి ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయగా.. ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌కు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపును నిలిపివేసింది. దీనిపై సింగిల్‌ జడ్జి వద్ద పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరముందని డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్లు విచారణకు రావడంతో అందరి వాదనలు ఈనెల 19న వింటామని పేర్కొంటూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని