మెరుగైన చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 28/04/2021 16:00 IST

మెరుగైన చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు

అమరావతి: కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్‌ఏ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆరుప్‌కుమార్ గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. సుమారు రెండు గంటల పాటు విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఏపీ సర్కార్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది.

‘‘ప్రభుత్వం నోటిఫై చేసిన ఆస్పత్రులకు నోడల్ అధికారులను నియమించాలి. అధికారి ఫోన్‌ నంబర్‌, ప్రభుత్వం ప్రకటించిన ధరలు, పడకల సంఖ్యను ఆస్పత్రుల్లో ప్రదర్శించాలి. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి ఆక్సిజన్, అత్యవసర మందులు, ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలు, కొవిడ్‌ చికిత్స వంటి అంశాలను పర్యవేక్షించాలి. రోజువారీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కొవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాలను అవకాశం ఉన్నంత మేరకు త్వరగా తెలియజేయాలి’’ అని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని