మందుల కొరత లేకుండా చర్యలు: బుగ్గన

తాజా వార్తలు

Published : 22/04/2021 01:37 IST

మందుల కొరత లేకుండా చర్యలు: బుగ్గన

కర్నూల్: కొవిడ్‌ కష్టకాలంలో బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో వైరస్‌ కట్టడిపై ఆయన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కొవిడ్‌ను సమర్థంగా నియంత్రించిన జిల్లాగా కర్నూలు నిలిచిందన్నారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఛార్జీల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం వస్తే ఈ కమిటీ వెంటనే స్పందించి సంబంధిత ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటుందని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని