ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని

తాజా వార్తలు

Updated : 01/04/2021 12:13 IST

ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో నీలం సాహ్ని విజయవాడలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఇవాళ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తొలి మహిళా ఎస్‌ఈసీగా ఆమె గుర్తింపు పొందారు. కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు, ఉద్యోగులు కొత్త ఎస్‌ఈసీకి అభినందనలు తెలిపారు. ఎస్‌ఈసీగా తనను ఎంపిక చేసిన గవర్నర్‌కు ఈ సందర్భంగా నీలం సాహ్ని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో పరిషత్‌ ఎన్నికలు పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని