AP News: అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు

తాజా వార్తలు

Published : 28/10/2021 16:26 IST

AP News: అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు

అమరావతి: సోషల్‌ మీడియాలో జడ్జిలు, కోర్టులపై అనుచిత వ్యాఖ్యల కేసుపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా హైకోర్టు  సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ ఎస్పీ రేపు కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని సీబీఐ అరెస్టు చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న ఈకేసు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన సీఐడీ అధికారుల నుంచి సీబీఐ అధికారులు వివరాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు 11మందిని అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని