పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

పుల్లూరు: తెలంగాణ పరిధిలోని పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద భాజపా ఆధ్వర్యంలో ఏపీ వాసులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి అంబులెన్స్‌లను అనుమతించని నేపథ్యంలో తెలంగాణ వాహనాలను ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. తెలంగాణలోకి తమను రానివ్వనపుడు ఏపీలోకి ఎలా వస్తారని భాజపా నేతలు నిలదీశారు. ఏపీ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని తెలంగాణ పోలీసులు వారికి సూచించారు. తెలంగాణ వైపు రాకుండా ఆందోళకారులను అడ్డుకున్నారు. 

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. ఆస్పత్రి అనుమతి, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ ఉంటేనే పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు, సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టుల వద్ద రోగుల బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని