గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ

తాజా వార్తలు

Updated : 27/01/2021 12:12 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను గవర్నరుకు వివరించారు. 45 నిమిషాల పాటు చర్చించిన ఆయన ఎన్నికలకు పూర్తి స్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని కోరారు. వీటితో పాటు తాజాగా కొందరు అధికారులపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను ఎస్‌ఈసీ గవర్నర్‌కు తెలిపారు.

గవర్నర్‌తో ఎస్‌ఈసీ సమావేశం ముగిసిన అనంతరం సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎస్‌ఈసీకి అందిస్తున్న సహకారాన్ని గవర్నర్‌కు సీఎస్‌ చెప్పారు.

ఈ భేటి అనంతరం ఎస్‌ఈసీ కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించనున్నారు. సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ , డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 29  నుంచి తొలి దఫా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. నామపత్రాల దాఖలు కోసం ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించనున్నారు.

ఇవీ చదవండి..                                            

బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు ద్వివేది, గిరిజా శంకర్‌ల అభిశంసన

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని