20 రోజుల్లో.. ఫుట్‌బాల్‌ స్టేడియం నుంచి కొవిడ్‌ ఆసుపత్రికి..!
close

తాజా వార్తలు

Published : 11/06/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

20 రోజుల్లో.. ఫుట్‌బాల్‌ స్టేడియం నుంచి కొవిడ్‌ ఆసుపత్రికి..!

అసోంలో 300 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభం

గువాహాటి: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతిని నివారించేందుకు అసోం ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గువాహాటిలోని సరుసజాయ్‌ ఫుట్‌బాల్‌ క్రీడా మైదానాన్ని 300 పడకలున్న కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేసింది.  ఈ ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ప్రారంభించారు. రూ.21.46 కోట్ల వ్యయంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సహకారంతో కేవలం 20 రోజుల్లో ఈ ఆసుపత్రిని నిర్మించడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘కొవిడ్‌ రోగుల చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 309 ఐసీయూ, 2,684, ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేశాం. ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అవసరమైన మేరకు ఆక్సిజన్‌ సరఫరా చేయగలిగాం. పొరుగున ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు సైతం తోడ్పాటు అందించగలిగాం’’ అని పేర్కొన్నారు. 

సరుసజాయ్‌ క్రీడా మైదానాన్ని 2007 జాతీయ క్రీడల కోసం నిర్మించారు. అనంతరం దీనిని ఫుట్‌బాల్‌ మైదానంగా మార్చారు. దీనిని గతేడాది జూన్‌లో.. ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని లో క్వారంటైన్‌లో ఉంచేందుకు ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు. ప్రస్తుతం 3,200 చదరపు మీటర్ల వైశాల్యంలో 200 ఆక్సిజన్‌, 100 ఐసీయూ పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇక్కడ ఎక్స్‌రే, ఫార్మసీ, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేసే సదుపాయాన్ని కూడా కల్పించారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో సుమారు 4 లక్షల మంది అసోం ప్రజలకు వైరస్‌ సోకింది. గురువారం నాటికి ఇక్కడ 3,793 మంది కొవిడ్‌తో మరణించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని